ఉదయం నిద్రలేచింది మొదలు.. ఉరుకులు, పరుగుల జీవితం.. రోడ్డెక్కింది మొదలు సమస్యలతో పోరాటం.. నిత్యం నరకప్రాయంగా మారిన నగరజీవి దుస్థితి ఇది.. ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉంటాయి.. పాలకులు చేయిస్తూనే ఉంటారు.. అయినా సగటు నగరజీవి కష్టాలు మాత్రం తీరవు.. కారణం ప్రభుత్వాలు పనిచేయకపోవడమా..? పాలకుల నిర్లక్ష్యమా..? ఇవేమీ కాదు ప్రజాశ్రేయస్సు పట్ల బాధ్యతారాహిత్యం.. సామాన్యుడు అంటే చులకన భావం.. అందుకే జనసైన్యం రంగంలోకి దిగింది.. భాగ్యనగరం సాక్షిగా., ఓ ప్రభుత్వ పెద్దలారా., పన్నుల రూపంలో జనాన్ని దోచుకునే గద్దల్లారా.. ఇవిగో నగరజీవి పడుతున్న కష్టాలు.. ఒక్కసారి కళ్లు తెరవండి.. ఒక్కసారంటే., ఒక్కసారి కళ్లుతెరిచి మా కష్టాలు చూడండి.. అంటూ జనసేనాని స్ఫూర్తితో రోడ్డెక్కింది.. నగర వీదుల సాక్షిగా ఈ సమస్యలకి పరిష్కారమేది అంటూ ప్రశ్నించింది..
నిత్యం సగటు నగరజీవి జీవితాన్ని నరకప్రాయంగా మార్చే సమస్యలు ఇవే అంటూ జనసైనికులు ఎత్తి చూపారు.. ఉదయం లేచింది మొదలు.. అడుగడుగునా సమస్యలే.. అతుకులు, గతుకుల రహదారులు., చిందరవందర గందరగోళంగా ట్రాఫిక్.. సామాన్యుడు బయటికి అడుగు పెడితే., బస్సెక్కినా, బైకెక్కినా ఒక్కటే.. రోడ్డు వేస్తారు.. వారం తిరగక్కుండానే పోతుంది.. ఒకవేళ కాంట్రాక్టరు జాలితలచి కాస్త క్వాలిటీతో వేస్తే., వేరే పని కోసం దాన్ని అడ్డదిడ్డంగా తవ్వేస్తారు.. తవ్విన రోడ్డు పూడ్చను కూడా పూడ్చరు.. ఈ చిందరవందరతో జూబ్లిహిల్స్‌లో ఉండే కాంట్రాక్టర్‌కి ఇబ్బంది లేదు.. నిజాంపేటలో ఉండే సామాన్యుడే ఆ బాధ భరించాలి.. ఈ పాపం జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్న పాలకులదా..? మామూళ్ల మత్తులో అడ్డదిడ్డంగా పనులు కేటాయించే యంత్రాంగానిదా..? ప‌్రజల సొమ్ము దుర్వినియోగం పాపం ఎవరిది..? జనసైన్యం నిలదీస్తోంది.. బదులు చెప్పండి.. ఇది ఆరంభమే..
భాగ్యనగరం భాగ్యం మొత్తం పోగేసుకుని ఉండే మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లలో., మీరు తిరిగే రహదారుల్లో చెత్తాచెదారం ఇంచుకైనా కనబడదు.. సామాన్యుడు నివశించే కుకట్‌పల్లి, లింగంపల్లిల్లో మాత్రం ఎక్కడ చూసినా., కంపే.. మా ఓట్లతో గెలిచేగా మీరు జూబ్లిహిల్స్‌కి చేరింది.. మా సమస్యలు మాత్రం మీకు పట్టవా..? సామాన్య నగరజీవి తరుపున జనసైన్యం సంధిస్తున్న మరో ప్రశ్న ఇది.. విశ్వనగరం.. విశ్వనగరం అని డబ్బాలు కొట్టుకునే మీరు.. ట్రాఫిక్, రహదారులు, త్రాగునీరు లాంటి సమస్యల వలయం నుంచి ఆ విశ్వనగరంలో నివసించే జనాన్ని ఎప్పుడు బయటపడేస్తారు.. జనం ఎన్నాళ్లీ కష్టాలు పడాలి..? మీ బాధ్యతలు మీరు గుర్తెరగకపోతే., మేం గుర్తు చేస్తాం.. మా సేనాని మాకు నేర్పింది అదే.. సమస్యలతో పోరాడటమే అంటూ.. నగరంలోని రహదారుల్లో తిరుగాడుతూ., సమస్య ఉన్న ప్రతిచోటా.. వాటి పరిష్కారం కోసం నినదించారు.. మా గొంతు పాలకులకు వినబడకుంటే., దిక్కులు పిక్కటిల్లేలా మళ్లీ మళ్లీ అరుస్తాం.. జనంతో కలసి పోరుబావుటా ఎగురవేస్తాం అంటూ హెచ్చరించారు..
నలుగురిలో స్ఫూర్తిని రగిల్చే ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రావణి, ప్రవీణ్, శ్రావణ్ మట్టా, వెంకటేష్, సంతోష్. రమేష్, విజయ్‌కుమార్, నానీ, మహేష్, సూర్య, సురేష్ , విష్ణు, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు..
source: pawantoday.com