సేవ అంటే రూపాయి ఖర్చు పెట్టి దాని ప్రచారానికి పది రూపాయిలు ఖర్చు పెట్టడం కాదు.. ప్రభుత్వ ఖజానానో., పార్టీలు నడిపేందుకు ఎవరో ఇచ్చిన సొమ్ముతోనే నాలుగు పథకాలు పెట్టేసి., ఆహా ఓహో అనుకోవడం అంతకన్నా కాదు.. మీకు మేం చేశాం కాబట్టి., ప్రతిఫలంగా మాకు ఓట్లు వేయండి అని అడగడమూ కాదు.. నిబద్దతతో కూడిన సేవ.. నిజాయితీతో కూడిన సేవ అంటే., ఓపిక ఉన్నంతలో ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండా చేసే సేవ.. జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేసింది అదే.. చేస్తుందీ ఆదే.. తన సైన్యంలో స్ఫూర్తిని నింపి చేయిస్తుందీ అదే..
జనసేన కార్యకర్తలు చేసే సేవా కార్యక్రమాలు మరింత విస్తృత పరిచేందుకు జనసేనుడు సేవాదళ్ని ఏర్పాటు చేశారు.. ఆయన ఏ ఉద్దేశంతో అయితే సేవాదళాన్ని ఏర్పాటు చేశారో.. అది ఆశించిన స్థాయిని మించి ఫలితాన్నిస్తోంది.. సేవాదళ్ చేసే సేవకు హద్దులు లేవు.. ప్రచారమూ రాదు.. ప్రత్యుపకారమూ ఉండదు.. ఎందుకంటే జనసైన్యం ఉన్నదంతా ఊడ్చేసి సేవ చేసేస్తారు కాబట్టి., ప్రచారం చేసుకోను ఏమీ మిగలదు.. పార్టీకి ఓట్లు అడిగేందుకు., సేవ అందుకున్న వారిలో 80 శాతం మంది ఓటు రాని చిన్నారులే..
జనసేన చేసే నిబద్దత, నిజాయితీలతో కూడిన సేవ చేస్తుందనడానికి నిదర్శనం తాజాగా ధవళేశ్వరంలోని దివ్యాంగుల పాఠశాలకు ఎల్ఈడీ బల్బులు., వాటర్ పైప్‌లు పంపిణీ చేసిన కార్యక్రమం.. తన వద్ద ఉన్న మొత్తంతో జనసేన పేరిట ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని భావించిన సేవాదళ్ సభ్యురాలు కళ్యాణీ అవినాష్., దివ్యాంగుల పాఠశాల్లో విద్యార్ధులకి పుస్తకాల్లాంటివి పంపిణీ చేసేందుకు ముందుకి వచ్చారు.. అయితే నిర్వాహకులు తమకు భారంగా మారుతున్న కరెంటు బిల్లుని తగ్గించేందుకు ఎల్ఈడీ డల్బులు., పాఠశాలకి అవసరమైన మరికొంత సామాగ్రి ఇవ్వమని కోరారు.. కంటిచూపు లేని వారికి సేవ చేసే అవకాశం దక్కడమే మహద్భాగ్యంగా భావించిన కళ్యాణి., తోటి జనసైనికులు గంటా స్వరూపా, వై శ్రీను, రాధాకాంత్ తదితరులతో కలసి., ధవళేశ్వరం దివ్యాంగుల పాఠశాలకి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు.. దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల నిర్వాహకురాలు కనకదుర్గకి ఆ మొత్తాన్ని అప్పగించారు.. దివ్యాంగులతో కాసేపు గడిపి., వారికి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు జనసేన సేవాదళం సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.. జనసైన్యం చేసే ఈ నిబద్దతతో కూడిన సేవ., మరికొందరికి స్ఫూర్తి కావాలనే ఉద్దేశమే మాది..