రాజకీయాలు కొందరి అవసరాలు తీర్చేందుకు నిర్ధేశించబడినవి కాదు.. భారత రాజ్యాంగం ప్రకారం.. ప్రతి భారత పౌరుడి హక్కుల పరిరక్షణకే కాదు.. ప్రతి భారత పౌరుడి అవసరాలు తీర్చేందుకు., సమస్యలు పరిష్కరించేందుకే పాలిటిక్స్.. పాలిటిక్స్‌ని కాస్త పాలిట్రిక్స్‌గా మార్చి నేటి నాయకులు అదే భారత పౌరుల హక్కులు కాలరాస్తున్నారు.. ఇలాంటి కుహనా శక్తుల తాట తీసేందుకు జనసేనని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జనసేనను స్థాపించారు.. జనసేన ఇది సామాన్యుడి సేన అన్న ఆయన పలుకులు., ఉత్తిమాటలు కాదు.. గట్టిమాటలు అంటూ జనజీవన స్రవంతికి దూరంగా., నాగరికతకు ఆవల బతుకుతున్న గిరిపుత్రుల భాగోగులు కూడా చూసేందుకు జనసైన్యం రెడీ అయ్యింది…
ఎన్నికల సమయంలో మాత్రమే కనబడే పార్టీల గుర్తులు, రంగులు మార్చే నాయకుల చరిత్రకు విరుద్దంగా జనసైనికులు మీకేం కావాలి.. అంటూ గిరిజనాన్ని పలుకరించడం., అడవిడబిడ్డలను ఆశ్చర్యపరిచింది.. మా గురించి ఆలోచించే వారు కూడా ఉన్నారా..? అన్న ఆలోచనను రేపింది.. విశాఖకు 200 కిలోమీటర్ల దూరంలో ముంచుపుట్టి మండలం, జంగంసరియ గ్రామం., నాగరికత అంటే అర్ధం తెలియని అడవిబిడ్డలను జనసేన సేవాదళ్ సభ్యులు పలుకరించారు.. వారి సమస్యలు తెలసుకుని., వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు..
పార్టీ కార్యాచరణ ఏంటి.. జనసేనుడి లక్ష్యాలు ఏంటి..? ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే రాజకీయాల సంస్కృతికి విరుద్దంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ సైనికులు ఎలా వచ్చారు..? అనే అంశాలను వారికి విశదపరిచారు.. మా కోసమే ఈ నాయకుడు పుట్టాడు., మా కోసమే జనసేన పుట్టింది.. అన్న నమ్మకానికి వచ్చిన గిరిపుత్రులు., జనసేనకు జై కొట్టారు.. కావాల్సింది అధికారదర్పం కాదు.. ఆదుకునే తత్వం.. అదే మా పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్., ఆయన సైన్యమైన మా లక్ష్యం అంటూ సేవాదళం సభ్యులు గిరిజనం సాక్షిగా శపదం చేశారు.
source: pawantoday.com