జనసేనుడి ఆశయం బలమైన పౌరసమాజ స్థాపన.. బలమైన పౌర సమాజ నిర్మాణం జరగాలంటే ముందు సమాజంలో పౌరులు అన్ని రకాలుగా బలంగా ఉండాలి.. కనీసం తమ ప్రాధమిక హక్కూ., ప్రజల చేతిలో పాసుపతాస్త్రం అయిన ఓటు హక్కు కలిగి ఉండాలి.. దారితప్పిన రాజకీయాలను గాడిన పెట్టాలన్నా., నియంతృత్వ పొకడలకు చరమగీతం పాడి., పాలిటిక్స్‌కి కొత్త రక్తం ఎక్కించాలన్నా., ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిందే.. ఎన్నికలు ఐదేళ్లకు ఓ సారే వచ్చినా., గీత దాటిన ప్రతి నాయకుడికి తాటతీస్తామని చెప్పే ఒకే ఒక అస్త్రం ఓటు హక్కు.. రాజకీయాలకు పరమార్ధం ప్రజాసేవ అన్న ఏకైక లక్ష్యంతో., పవర్ అనే మాటే ఎత్తని ఓ నవరాజకీయ శకం సృష్టించిన జనసేనాని లక్ష్యం నెరవేరాలన్నా., ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి.. అందుకే జనసైన్యం జనంలోకి వెళ్లింది.. కొత్త ఓటర్ల నమోదుకి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినయోగించుకోవాలంటూ జనానికి అవగాహన కల్పిస్తోంది.. దగ్గరుండి మరీ ఓటరు నమోదు చేయిస్తోంది..
జూన్ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ జులై నెల మొత్తం జరిగే స్పెషల్ డ్రైవ్‌లో పాల్గోని ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటూ ఊరూ.. వాడా.. తిరుగుతూ., గడపగడపను పలుకరిస్తూ ఓటు విలువని చాటుతూ జనసైన్యం దూసుకుపోతోంది.. జనసేనుడి బాటలోనే జనసైన్యం కూడా ఏ ఒక్కరినీ తమ పార్టీకి ఓటు వేయమని అడగడం లేదు.. జనసేనను గెలిపించమనీ అడగడం లేదు.. ఐదేళ్ల పాటు మనల్ని ఏలే నాయకుడు., మనకు నచ్చిన వాడై., మనం మెచ్చిన వాడై ఉండాలి.. మన సమస్యలు తెలిసిన వాడై ఉండాలి.. వాటిని పరిష్కరించ గలిగే వాడై ఉండాలి.. అలాంటి నాయకుడ్ని ఎన్నుకోవాలంటే ఓటు ఉండి తీరాల్సిందేనన్నది జనసేన కార్యకర్తల ఉద్దేశం.. ఓపిక.., ఓర్పుతో.. కదిలి ఓటు లేని ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నారు.. స్టాల్స్ పెట్టి మరీ ఓటర్లను నమోదు చేయిస్తున్నారు..
బలమైన పౌరసమాజ నిర్మాణం కోసం., బలమైన నాయకుడ్ని ఎన్నుకోవడంలో యువతదే కీలకపాత్ర.. ప్రలోభాలను పక్కనపెట్టి రాజకీయాల్లో నవశకాన్ని నిర్మించే క్రమంలో మీ బాధ్యతే ఎక్కువ.. అందుకే ఆ బాధ్యతను మోసేందుకు అందర్నీ సిద్ధం చేసే పనిని జనసైనికలు భుజాన వేసుకున్నారు.. ఐదేళ్ల పాటు ఏలే హక్కుని ఇవ్వడమే కాదు.. ఏలిక తప్పు చేస్తే., రాజకీయ సమాజం నుంచి వారిని వెలివేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపు నిస్తోంది..
మన లక్ష్యం.. మన గమ్యం.. ప్రజాస్వామ్యం అయితే.. నిజమయిన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడంలో మీ వంతు పాత్ర పోషించాలంటే., నిబద్దత గల నాయకత్వాన్ని ఎంచుకోవాలంటే ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి.. జులై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఈసీ స్పెషల్ డ్రైవ్(ఓటరు నమోదు)లో ఓటు లేని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోండి.. ఓ బలమైన ఆశయానికి ఊపిరి పోసే క్రమంలో మీ వంతు సహకారం అందించాలని పవన్‌టుడే కూడా విజ్ఞప్తి చేస్తోంది..