ఉద్దానం కిడ్నీ క్రానిక్ డిసీజ్.. దశాబ్దాల తరబడి పాలకులకి అతిచిన్న సమస్యగా కనబడిన., 20 వేల మందికి పైగా ప్రాణాలు తీసిని ఈ భయంకర మహమ్మారిని ప్రపంచం మాత్రం అతిపెద్ద సమస్యగా గుర్తించింది.. అదీ 2017 జనవరి తర్వాత.. అప్పటి వరకు ఎన్నికల ముందు ఓట్ల కోసం మాత్రమే పార్టీలు ఉద్దానం వ్యాధి గురించి మాట్లాడేవి., ఎన్నికలయ్యాక అధికార పార్టీలు ఆ సమస్య ఉందన్న సంగతే మరిచిపోతే., మైలేజ్ అవసరమనుకున్నప్పుడల్లా., ప్రతిపక్ష పార్టీలు ఉద్దానం గురించి మాట్లాడేవి.. గడచిన రెండు దశాబ్దాలుగా జరిగింది ఇదే.. మరి ఇప్పుడు ఉద్దానం ఒక్కసారిగా ఎలా తెరపైకి వచ్చింది.. ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించింది..? దేశవిదేశాల్లో ఉన్న వారికి కూడా., స్వదేశంలో కిడ్నీ వ్యాధి పీడితులైన తమ సొంతవారి గురించి భరోసా కల్గించిన విషయం ఏంటి..? అంతటి గుండెనిబ్బరాన్ని నింపింది ఎవరు..? కేవలం మూడు వసంతాల చరిత్ర., ఎన్నికల్లో పోటీకి కాదు., సమస్యలపై పోరాటానికే పుట్టామంటూ జనం ముందుకి వచ్చిన జనసేన., ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ల వల్లే ఇది సాధ్యమైంది..
అతిభయంకరమైన కిడ్నీ రోగం ప్రజల ప్రాణాలు తీస్తోంది.. అన్న సంగతి అందరికీ తెలుసుగానీ., దాని తీవ్రత ఇంత దారుణంగా ఉందన్న సంగతి మాత్రం పవన్‌కళ్యాణ్., జనసైన్యం ఎంట్రీతోనే ప్రపంచానికి తెలిసింది.. జనసైనికులు సమస్యను పార్టీ ముందు ఉంచారు.. అధినేత ఆఘమేఘాలపై స్పందించారు.. నేరుగా ఉద్దానం ప్రాంతానికి వచ్చి బాధితుల్ని పరామర్శించి., తన తరుపున భరోసా ఇచ్చారు.. ప్రభుత్వాన్ని కదిలించడమే కాదు., పార్టీ తరుపున సమస్య పూర్తి పరిష్కారానికి ఓ టీంని ఏర్పాటు చేసి నిరంతర కృషి చేస్తున్నారు.. ఆయన ఎక్కడికి వెళ్లినా., ఉద్దానంకి ఊపిరి ఊదేందుకు ఏమైనా సాయం దొరుకుతుందా..? అని వెంపర్లాడారు.. తత్ఫలితమే హార్వార్డ్ డాక్టర్ల టీం ఉద్దానం పరిశోధనకి ముందుకి రావడం.. ఇప్పటికే డాక్టర్ దుర్గారావు., డాక్టర్ రవి ఆకుల., డాక్టర్ కుమార్ కొత్తపల్లిల ఆధ్వర్యంలో ఇప్పటికే జనసేన ఉద్దానం మిషన్ కొనసాగిస్తోంది..
జనసేన ఎఫర్ట్ ఏ స్థాయిలో ఉందంటే.. ఎన్ఆర్ఐ జనసేన టీం రూపొందించిన ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..సతీష్‌రెడ్డి అనే జనసైనికుడు ఉద్దానం జనానికి అండగా జనసేన ఉండగా., మనకేల భయం.. అంటూ రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. అధికారం లేదు.. పదవులూ లేవు.. అయినా భరోసా మాత్రం ఉంది.. అది జనసేనుడు ఇచ్చిన భరోసా.. జనానికి గుండెలు నిండే భరోసా.. ఇక్కడ వారికే కాదు.. అక్కడ(విదేశాల్లో ఉన్న) వారికి కూడా పవనే భరోసా..
source : pawantoday.com