అధికారం లేదు.. పదవులు లేవు.. గుండెల నిండా జనసేనుడు నింపిన స్ఫూర్తి మాత్రం టన్నుల కొద్ది ఉంది.. ఆ స్ఫూర్తే ఉదయం నిద్ర లేనింది.. తిరిగి మంచం ఎక్కేవరకు ఒక్కటే ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారు.. ఎలాంటి సహాయం వారికి అవసరం.. అని వెతికి మరీ చేసేస్తున్నారు.. ఎవరికి ఏ సమస్య ఉన్నా.,, ఆ సమస్య తమదే అనుకుంటున్నారు.. బోర్డర్లో సైన్యం శత్రుదేశాల నుంచి రక్షణ కల్పిస్తుంటే., జనసైన్యం సమస్యల నుంచి కష్టాల నుంచి 24 గంటలు ప్రజలకి రక్షణ కల్పిస్తోంది.. దేశచరిత్రలో ఏ నాయకుడు నింపలేని స్ఫూర్తి.. ఏ పార్టీ కార్యకర్తలు చేయలేని., చేయని సేవ ఇది.. స్కూల్‌కి వెళ్లే చిన్నారుల దగ్గర నుంచి మూడు కాళ్ల ముసలి వరకు ఈ సేవను అందుకునేందుకు అందరూ అర్హులే.. జనసైన్యం సేవ., సమాజంలో చేయగలిగిన స్థోమత, ఓపిక ఉన్న అందరిలో స్ఫూర్తిని నింపాలన్న లక్ష్యంతో.. ప్రతి పనినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం..


ఇక జనసేనుడి స్ఫూర్తి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.. ఖండాంతరాలు దాటి మరీ ప్రవహిస్తోంది.. ఉభయగోదావరి జిల్లాల్లో టీం జనసేన కువైట్ విభాగం అభాగ్యులని ఆదుకున్న తీరే అందుకు నిలువెత్తు నిదర్శనం.. సంపాదన కోసం దేశాలు దాటి వెళ్లిన పవన్ అభిమానులు సంపాదించిన మొత్తంలో కొంతభాగాన్ని., జనసేనుడి స్ఫూర్తితో స్వదేశంలో ఉన్న అన్నార్తుల ఆదుకునేందుకు ఖర్చు చేస్తున్నారు.. సత్యమేవ జయతే ఫౌండేషన్ పేరుతో గడచిన 18 నెలల కాలంలో 11 లక్షల 80 వేల రూపాయిలు పేదల సేవకు వినియోగించారు..

ఈ కార్యక్రమాలన్నీ మీ ముందు ఉంచడం వెనుక ఉద్దేశం.. ప్రచారార్భాటం కాదు.. పదిమందికి స్ఫూర్తిని పంచడమే.. జయహో.
Originally Published by Pawantoday.com


