ఈ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బ్యాచ్‌లు త‌యార‌య్యాయి.. వీటికి రాజ‌కీయ చ‌తుర‌త మెండు.. కానీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట ప‌టిమ మాత్రం గుండు.. జ‌నంతో ఓట్లేయించేసున్నారు.. జ‌నం ఓట్ల‌తో కొన్ని సీట్లు కూడా గెలిచారు.. కానీ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై నిబ‌ద్ద‌త నేతి బీర‌లో నేతి చంద‌మే.. రాజ‌కీయ ల‌బ్ది చేకూరుతుంద‌నుకుంటే., వ‌స్తారు.. ప‌లుక‌రిస్తారు.. పాల‌కుల్ని నాలుగు తిట్లు తిట్టేస్తారు.. వెళ్లిపోతారు.. ఆ త‌ర్వాత ఆ స‌మ‌స్య ఊసుకూడా ఎత్త‌రు.. ఇంకా వీల‌యితే., ఎవ‌రైనా ఆ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూపితే., త‌ద్వారా వ‌చ్చే క్రెడిట్‌ని మాత్రం మా పోరాట ఫ‌లిత‌మేనంటూ హైజాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తారు.. ఎవ‌రు.. ఏం చేశార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయినా., నిస్సిగ్గుగా సొంత డ‌బ్బా కొట్టుకుంటూ., అనుంగ మీడియాలో ప్ర‌చారం ఒక‌టి.. ఉద్దానం కిడ్నీ బాధితుల వ్య‌వ‌హారంలోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి.. ఉద్దానాన్ని ఈ వ్యాధి క‌భ‌ళించి రెండు ద‌శాబ్దాలు దాటింది.. అప్ప‌టి నుంచి ఆ మీరు., మీ పెద్ద‌లు గెలిచారు.. అధికారంలో ఉన్నారు.. అప్పుడు ఏం చేయ‌లేని మీరు ఇప్పుడు ఉద్దానానికి ఏం చేశారో జ‌నానికి తెలుసు..

ఇక అస‌లు ఇంత సీరియ‌స్ స‌మ‌స్య ఉద్దానంలో ఉంద‌న్న సంగ‌తి.. రెండు ద‌శాబ్దాల కాలంలో కిడ్నీ క్రానిక్ డిసీజ్ అనే ఈ మృత్యువు దెబ్బ‌కి 20 వేల మంది చ‌నిపోయార‌ని., ఇంకా వేలాది మంది బాధితులు మూత్ర‌పిండాల వ్యాధితో బాధ ప‌డుతున్నార‌ని బాహ్య ప్ర‌పంచానికి ఎప్పుడు తెలిసింద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. అదే జ‌న‌సేనాని., ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం బాధితుల త‌రుపున త‌న గ‌ళం ఎప్పుడైతే విప్పారో., అప్పుడే ఉద్దానం వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా పాకేసింది.. అలా అని ఇప్పుడు విజయం త‌ర్వాత మా గొప్పే అని చెబుతున్న వారిలా., ఏదో తూతూ మంత్రంగా వ‌చ్చి ప‌లుక‌రించి ఊరుకోలేదు జ‌న‌సేనుడు.. ఉద్దానానికి ఊపిరి ఊదేందుకు ఓ య‌జ్ఞ‌మే చేశారు.. ముందుగా కొన్ని ప‌రిష్కార మార్గాలు., కొన్ని తాత్కాలిక ఉప‌స‌మ‌నాలు ప్ర‌భుత్వానికి సూచించారు.. 48 గంట‌ల గ‌డువు పెట్టారు.. పార్టీ త‌రుపున డాక్ట‌ర్ల‌తో కూడిన ఓ బృందాన్ని నియ‌మించారు.. ఉద్దానంపై స్ట‌డీ చేయ‌మ‌న్నారు.. ప‌వ‌న్ సూచ‌న‌లు పాటించేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది.. అయినా అంత‌టితో జ‌న‌సేన పోరాటం ఆగ‌లేదు..

ఉద్దానం ప్రాంత వాసుల పాలిట మ‌హ‌మ్మారిగా మారిన కిడ్నీ వ్యాధి అంతుచూడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. గెలుపు, ఓట‌మి అనే సంబంధం లేకుండా., కుల‌మ‌తాలు., వ‌ర్గ విబేధాల‌తో బంధం లేకుండా., ఉద్దానం వాసుల‌కి శాశ్విత ఉప‌స‌మ‌నం క‌ల్పించాల‌ని జ‌న‌సేనుడు నిర్ణ‌యించుకున్నారు.. ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ‌., ఉద్దానాన్ని ఆదుకునే నాధుల కోసం అన్వేషించారు.. హార్వార్డ్ యూనివ‌ర్శిటీ గౌర‌వ ప్ర‌సంగానికి హాజ‌రైన‌ప్పుడు సైతం ఆయ‌న ఉద్దానాన్ని., దాని వెనుక దాగిఉన్న ఉద్వేగాన్ని మ‌రువ‌లేదు.. అక్క‌డ డాక్ట‌ర్ల‌కి ఉద్దానం స‌మ‌స్య‌ను వివ‌రించారు.. ప‌రిశోధ‌న‌ల‌కి రండి అని ఆహ్వానించారు.. ప్రతి రోజు మిష‌న్ ఉద్దానం ప్రాజెక్టు ఎలా న‌డుస్తోంది..? అంటూ స్వ‌యంగా మానిట‌రింగ్ చేశారు..

చిట్ట చివ‌రికి పాల‌క‌వ‌ర్గం సానుకూలంగా స్పందించి., దేశంలోనే తొలిసారి కిడ్నీ వ్యాధి గ్ర‌స్తుల‌కి నెల‌కి 2.500 రూపాయిలు ఫించ‌న్ రూపంలో అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఆసుప‌త్రుల‌కి కొత్త ప‌రిక‌రాలు ఏర్పాటుకి ఆమోదం తెలిపింది.. ఆ వెంట‌నే హైజాక‌ర్లు రంగంలోకి దిగారు.. మా పోరాటం ఫ‌లించిందంటూ డ‌ప్పుకొట్ట‌డం మొద‌లుపెట్టారు.. అయితే ఇంత గ్రౌండ్ వ‌ర్క్‌.. ఇంత‌టి క‌మిట్‌మెంట్‌., నెట్‌వ‌ర్క్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం కోసం ఎంత చేశారో జ‌నానికి తెలుసు.. ఇందులో ఏ ఒక్కిటీ పూర్తి చేయ‌లేని పార్టీలు., నాయ‌కులు జ‌న‌సేనుడిని విమ‌ర్శించ‌డం.. ప్ర‌జ‌ల‌కి ఏదైనా మంచి జ‌రిగితే., ఆ మంచిని త‌మ ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. ఇవ‌న్నీ జ‌నం న‌మ్మ‌ర‌నుకోండి..

తాజాగా ఉద్దానానికి ఊపిరి ఊదే ప్ర‌య‌త్నంలో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన కృషిని స్వ‌యంగా ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ గుర్తించింది.. ఉద్దానం వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వానికీ., ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేసిన జ‌న‌సేనుడికి శుబాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. అందుతో ఈ సెల్ఫ్ డ‌బ్బాగాళ్ల పేరు ఎక్క‌డ విన‌బ‌డ‌డం లేదు.. క‌నీసం క‌న‌బ‌డ‌డం లేదు..

 

 

 

 

Source: pawantoday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments