జ‌న‌సేన‌కు ప్రాంతం లేదు.. కులం లేదు. .మతం లేదు.. ఉన్న‌ది ఒక్క‌టే జ‌న‌బ‌లం.. ఆ జ‌నం కోసం ప్ర‌శ్నించే ద‌మ్ము.. ఆ ప్ర‌శ్నించే హ‌క్కు కోసం వంద‌లాది మంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే మేము సైతం అంటూ జ‌న‌సేన వేదిక‌ల‌కి ముందుకి వ‌చ్చారు.. ఇంకా వ‌స్తున్నారు.. జ‌న‌సేనుడు ఏదైతే ల‌క్ష్యంతో.., బ‌ల‌మైన పౌర‌స‌మాజ నిర్మాణం కోసం రాజ‌కీయాల్లో యువ‌కుల‌ను., మేధావుల‌ను భాగ‌స్వాముల్ని చేసేందుకు ఏర్పాటు చేసిన వేదిక‌లు లక్ష్యం దిశ‌గా దూసుకుపోతున్నాయి.. తెలంగాణ‌లో పార్టీ ఉందా అన్న అనుమానాలు వ్య‌క్తం చేసిన వారికి., జ‌న‌సేన బ‌లం ఇది అని చూపుతూ వేలాది మంది ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు ముందుకి వ‌చ్చారు.. మొన్న రంగారెడ్డి., ఇప్పుడు సంగారెడ్డి(ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా) ల్లో జ‌రిగిన ఔత్సాహిక శిభిరాలు చూస్తే బ‌లం ఉందా అని ప్ర‌శ్నించిన వారు కాస్తా., ఇంత బ‌ల‌గం ఉందా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు..

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌రిధిలో జ‌న‌సేనుడి పిలుపు యువ‌త‌ని భారీగా క‌దిలించింది.. ఎలా అంటే సంగారెడ్డి ప‌ట్ట‌ణం మొత్తం సేన జెండాల‌తో శ్వేత వ‌ర్ణం పులుముకుందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.. ఎంపిక శిభిరాల‌కు వ‌చ్చిన పార్టీ ప్ర‌తినిధుల‌కి అద్భుత స్వాగ‌త స‌త్కారాలు.. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే., చాలా మంది పార్టీ మూడు విభాగాల‌కు పిలుపు నివ్వ‌గా., మూడు విభాగాల్లో ఎక్క‌డైనా జ‌న‌సేన‌కు సేవ చేస్తే చాలు అని స్పీక‌ర్‌, కంటెంట్ రైట‌ర్‌, అన‌లిస్ట్ మూడు ప‌రీక్ష‌ల‌కీ హాజ‌రు కావ‌డం విశేషం..

వ‌చ్చిన యువ‌త అంతా జ‌న‌సేన తెలంగాణ‌లో సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను ఏక‌రువు పెట్ట‌డంతో పాటు., పార్టీకి ప్రాంతీయ రంగు పులుముదామ‌ని జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టారు.. జ‌న‌సేన ఏ ప్రాంతానికీ ప‌రిమిత‌మైన పార్టీ కాదు.. ఇది సామాన్యుడి పార్టీ.. సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్ర‌శ్నించ‌డానికి వ‌చ్చిన పార్టీ.. జ‌నాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న నాయ‌కుల్ని త‌రిమికొట్టేందుకు వ‌చ్చిన పార్టీ అంటూ గ‌ళం విప్పారు.. నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాల కోసం., నిజాయితీతో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే ద‌మ్మున్న జ‌న‌సేన‌తో క‌ల‌సి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు..

తెలంగాణ‌లో స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన దృష్టి పెడుతోంది.. ఆ ప్రాంత పార్టీ.. ఈ ప్రాంత పార్టీ అనే విమ‌ర్శ‌లు మాని., ద‌మ్ముంటే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. లేదంటే.. జ‌న‌సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండంటూ ఔత్సాహికుల వేదిక నుంచే ప్ర‌త్య‌ర్ధుల‌కి హెచ్చ‌రిక‌లు పంపారు.. వంద‌ల సంఖ్య‌లో ఔత్సాహికులు త‌ర‌లిరావ‌డంతో., పార్టీ శ్రేణ‌లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఎంపిక ప్ర‌క్రియ‌ని కొన‌సాగించారు.. త్వ‌ర‌లో అంద‌ర్నీ జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌లిసి., దిశా నిర్ధేశం గావిస్తార‌ని పార్టీ ప్ర‌తినిధులు ఔత్సాహికుల‌కి హామీ ఇచ్చారు.. వేదిక వ‌ద్ద‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి సేవ‌లు పార్టీ వినియోగించుకుంటుంద‌ని తెలిపారు..

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments