ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అంటే.. తూతూ మంత్రంగా కాసేపు హ‌డావిడి చేసి చేతులు దులుపుకోవ‌డం కాదు.. ఎప్పుడో ఒక మాట మాట్లాడేసి., ఇక ఆ స‌మ‌స్య ఎప్పుడు ప‌రిష్కారం అయినా., ఆ క్రెడిట్ మొత్తం నాదే అని చెప్పుకోవ‌డమూ కాదు.. స‌మ‌స్య ప‌రిష్కారం అంటే ఇలా ఉంటుంది.. అదే జ‌న‌సేన మిష‌న్ ఉద్దానం.. రెండు ద‌శాబ్దాల‌కు పైగా వేలాది మందిని క‌భ‌ళించి పీడిస్తున్న స‌మ‌స్య‌.. వేలాది మంది ప్రాణాలు బ‌లిగొన్న స‌మ‌స్య‌.. కానీ ఏనాడు ఇక్క‌డ ఇంత‌టి తీవ్ర‌మైన స‌మ‌స్య ఉంద‌ని భాహ్య‌ప్ర‌పంచానికి తెలియ‌దు.. కేవ‌లం పార్టీల ఎన్నిక‌ల మేనిఫెస్టోల్లో మిన‌హా., ఆ ప్రాంతంలో రాజ‌కీయ పార్టీల ప్ర‌చారంలో మిన‌హా క‌న‌బ‌డ‌ని స‌మ‌స్య‌.. ఇంకా బ‌య‌టికి ఎలా తెలుస్తుంది మ‌రి.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ లాంటి సంస్థ‌లు సైతం రంగంలోకి దిగి ప‌రిశోధ‌న‌లు చేసినా., నాయ‌కులు మాత్రం ప‌ట్టించుకోని స‌మ‌స్య‌.. ఈ స‌మ‌స్య జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చిన‌ప్పుడు., తీవ్ర‌మైన ఆవేద‌న‌కి గుర‌య్యారు.. ఆ స‌మ‌స్య మూలాలు క‌నుగొన‌డం ఎలా..? కూక‌టివేళ్ల‌తో పీకేయ‌డం ఎలా..? అన్న ఆలోచ‌న చేశారు..

జ‌న‌సేనుడు ఉద్దానం బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్ళే స‌మ‌యానికి ఎన్నో వెట‌కారాలు., విమ‌ర్శ‌లు.. ప్ర‌భుత్వాలే ఏం చేయ‌లేక పోయాయి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం చేస్తారు..? కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చాపురంలో అడుగుపెట్టే ముందే మిష‌న్ ఉద్దానంకు ఆయ‌న రూప‌క‌ల్ప‌న చేసేశారు.. ఎవ‌రికి క‌ల‌వాలో తెలియ‌దు.. ఎలా చెయ్యాలో తెలియ‌దు.. కానీ స‌మ‌స్య‌పై అవగాహ‌న ఉంది.. ప‌రిష్కారంపై గుండెల నిండా నిబ‌ద్ద‌త అయితే ఉంది.. బాధితుల ప‌రిమ‌ర్శ త‌ర్వాత‌.., స‌త్వ‌ర ఉప‌స‌మ‌నం కోసం ప్ర‌భుత్వం ముందు కొన్ని ప‌రిష్కారమార్గాలు ఉంచారు.. 48 గంట‌ల గ‌డువు పెట్టారు.. అంత‌టితో వ‌దిలేయ‌లేదు.. త‌న బృందంతో మూలాల అన్వేష‌ణ‌పై దృష్టి సారించారు..

ఈ లోపు విశ్వ విఖ్యాత హార్డార్డ్ యూనివ‌ర్శిటీ., విద్యార్ధుల‌కి సందేశం ఇవ్వ‌మంటూ ఆయ‌న్ని ఆహ్వానించింది.. ఆ టూర్‌ని కూడా జ‌న‌సేనుడు ఉద్దానం నెఫ్రోప‌తిని తుద‌ముట్టించేందుకే ఉప‌యోగించారు.. త‌న ప్ర‌సంగంలోనే కాదు., విడిగా మూత్ర పిండాల నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు.. మా దేశంలో.. మా జ‌నం చ‌నిపోతున్నారు.. మీరు వ‌చ్చి ఆదుకోండి అంటూ విజ్ఞ‌ప్తులు చేశారు.. జ‌న‌సేనుడి కృషి ఇప్పుడు ఫ‌లితాన్నిస్తోంది..

ఉద్దానం స‌మ‌స్య‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వివ‌రించిన తీరు చూసి చ‌లించిపోయిన హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్‌కి చెందిన వైద్యాధికారులు., ఇక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేసేందుకు ముందుకి వ‌చ్చారు.. ఈ నెలాఖ‌రుకి హార్డ‌ర్ వైద్యుల బృందం టీం జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఉద్దానం బాధితుల్ని క‌లిసేందుకు రెడీ అవుతోంది.. ఉద్దానం నెఫ్రోప‌తిపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపిన‌., హార్వ‌ర్డ్ టీం., ఈ వ్యాధి కార‌ణంగా ఇప్ప‌టికే చాలామంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు గుర్తించింది.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తెరిగింది.. వెనువెంట‌నే ఉద్దానం ప్రాంతంలో ఓ అంత‌ర్జాతీయ స్థాయి వైద్య ప‌రిశోధ‌నా సంస్థ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది.. హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్‌కి చెందిన ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ జోస‌ఫ్ బెన్వంత్రే పంపిన సందేశంలో ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు.. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నామ‌ని చెబుతున్న ఆయ‌న ., మూలాలు గుర్తించ‌డంపై ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు.. ప‌రిష్కారం క‌నుగొనేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు బెన్వంత్రే త‌న సందేశంలో పేర్కొన్నారు.. ఇప్ప‌టికే ఉద్దానం బాధితుల ఆరోగ్య స‌మ‌స్య విష‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆయ‌న వైద్యుల బృందం చేస్తున్న కృషిని ఇక్క‌డ ప్ర‌స్థావించారు..

జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు గుప్పించే వారంతా ఇప్పుడు చెప్పండి.. స‌మ‌స్య‌ ప‌రిష్క‌రం అంటే., మీకు ఓట్లేసిన జ‌న‌మే సిగ్గుప‌డే రీతిలో తిట్టుకోవ‌డ‌మా..? లేక జ‌నం క‌ళ్లనీళ్లు తుడిచేందుకు మీరు చేసే పైపై హ‌డావిడా..? లేదా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లా మూలాల‌తో స‌హా స‌మ‌స్య‌ను తుద‌ముట్టించేందుకు నిబ‌ద్ద‌త‌తో కూడిన ప్ర‌య‌త్న‌మా..? మీలో నిజంగా నిబ‌ద్ద‌త ఉంటే., నిజాయితీ ఉంటే.. ఉద్దానానికి ఊపిరి ఎవ‌రు..? మేమే అని చెప్పుకుంటున్న మీరా..? ఇంత‌టి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్న జ‌న‌సేనుడా.. జ‌నం చూస్తున్నారు.. మీరే తేల్చుకోండి..

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments