రోజు చాలా మంది చనిపొతూ  ఉంటారు, చంపుతూ ఉంటారు ..

నా problem అది కాదు .. నా angle కూడా అది కాదు .

ఊహతెలిసినప్పటి నుంచీ ఆ కుర్రాడు టీవీ లో పవన్ కళ్యాణ్ ని చూస్తూ మా హీరో మా హీరో అని గొప్ప చెప్పుకోవడం ఆ తల్లి చూసి మురిసిపోతూ ఉండేది , చదువుకోవడం కోసం కూడా ఉదయాన్నే లేవని ఆ కుర్రాడు పొద్దున్నే అలారం పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ సినిమా మొదటి ఆట కోసం పరిగెడుతూ ఉంటే సర్లే వాడే వస్తాడు అని అనుకుని ఊరుకునేది , చదువుని నిర్లక్ష్యం చేస్తూ జనసేన జండా అంటూ తిరుగుతూ ఉంటే పోన్లే హీరో పేరుతోఅయినా దేశం మీద బాధ్యత తెలిసింది – ఇంటి బాధ్యత కూడా తెలుసుకుంటాడు అని సర్ది చెప్పుకునేది , హీరో పేరు చెప్పుకుని ఎంతోకొంత మంచి చేస్తూ మరికొంత మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే మంచి బాటలోనే ఉన్నాడులే అని సమాధానం చెప్పుకునేది ..

కానీ ఒక్కసారిగా తన కళ్ళముందున్న ప్రపంచం తారుమారు అవుతుంది అని ఆమె ఊహించనే లేదు .. హీరోమీద అభిమానం తో , ఎదో చెయ్యాలి అనే తపనతో వెళుతున్న అతని పరుగుని ఆపకపోవడం వలన చుట్టిన చాపలో తన కొడుకు శవం తన కళ్ళముందు విస్తరి పరచుకుంటుంది అని కలలో కూడా అనుకోలేదు .

ఎవరి కోసం తన అయితే కొడుకు ఎగిరి గోల చేసేవాడో , తలచుకుని మురిసిపోయేవాడో , అతన్ని కలిస్తే చాలు తరించినట్టే అనుకునేవాడో .. అదే వ్యక్తి తన ఇంటి తలుపు తీసుకుని తనని ఓదార్చడం తన ఇంట్లోకి ఒస్తుంటే చమర్చిన కళ్ళు తుడుచుకుని జీవితం లో మొట్టమొదటి సారి అతన్ని చూసిన ఆమెకి కలిగే ఫీలింగ్ కి ఏ పదం వాడగలను ???

సిద్దు మ౦చిక౦టి

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments