ఆయన పేరు చెప్పాగానే మరిచిపోయిన భాద్యత గుర్తుకు వస్తు౦ది ,ఆరిపోయిన ఉత్సాహ౦ పు౦జుకు౦టు౦ది ..జీవిత౦లో ఎవరినీ పట్టించుకోనివాడు కూడా ఒకే ఒక్క మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అంతటి ఘనత మన పవన్ కళ్యాణ్ ది. మనం బాగ ఎదిగాక ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. కాని ఒక మనిషి ఒడిదుడుకులు ఎదుర్కుంటూ కూడా పదిమందికి ఆదర్షంగా నిలిచాడంటే అదీ పవన్ కల్యాణ్ గొప్పతనం.
ఒక ఫాన్ ని నువ్ ఎందుకు పవన్ కల్యాణ్ కి అంత పిచ్చి ఫాన్ వి అని అడిగితే అంత త్వరగా చెప్పలేడు. ఎందుకంతే మనమెలా ఉన్నా మనమంటె మనకి చాలా ఇష్టం . ఎందుకని అడిగితే ఏం చెప్తాం …..

ఒక పది నిమిషాలు ఆలొచించాక చెప్పమంటే మాత్రం ఇలా చెప్తాను.

ఈ రోజుల్లో ఒక మనిషిని మనం పూర్తిగా నమ్మడం అంతె అంత సులభంగా అయ్యే పని కాదు ఎందుకంటే అది మనకున్న సమస్యలవల్ల ,ఇప్పుడున్నా తీరికలేని జీవన శైలి వల్ల పక్క వాళ్ళని పట్టి౦చుకోవడ౦ మానేసాం . మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తే చాలు కదా అనేసుకుంటున్నాం .అలాంటి సమయంలో ఒక మనిషి మన జీవితాన్ని ఒక్క సెకను అలా ఆగిపోయేలా చేసి మన భాద్యతను గుర్తు చేస్తూ నిరంతరం మనల్ని మనకిష్టమైన రీత్లో ప్రభావితం చేస్తూ ఉంటే ఎవరు మాత్రం వినకుంటారు చెప్పండి

“.

అతను మట్లాడితే మన మనసు చెప్పలేని ఎక్కడో దాగి ఉన్న్న భావావేషాలు భటికి వస్తాయి. నాకు ఇలా చెయ్యలని , నాకు ఇలానే మట్లాడాలి అనిపిస్తుంది. సమాజం లో జరిగే అన్యాయాలను కళ్ళతో చూసి కూడా ఏ చెయ్యలేక మొహం చాటేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చేతలు, మాటల వల్ల ఊరట కలుగుతుంది. పోనీలే నాలోని మనిషి ఇంకా చనిపోలేది జీవమనేది నాలో ఉందిలే, స్పందించే హ్రుదయం నాకు ఉందిలే అనిపిస్థుంది. పక్షవాతం వచిన హ్రుదయానికి కదలిక వస్తుంది పవన్ కల్యాణ్ మాటలు వింటే.
మనకి జీవితం లో ఎవర్నైనా మనస్పూర్తిగా నమ్మలి అని ఉంటుంది… కాని దురద్రుస్టవశాత్తు దానికి వేరే వాల్లు నోచుకోలేరు , మనమూ నోచుకోలేము. పవన్ కల్యాణ్ మాటలు నమ్మేలా ఉంటాయి. ఆ చేతలలా నిరూపించాయి. పోనీలే జీవితంలో ఒకరిని పూర్తిగ నమ్మను అనే త్రుప్తి ఉంటుంది…..
ఇలా ఆయన్ గురించి చెప్పుకుంటూ పోటే మాటలకు కొదువలేదు. అలాంటి మనిషికి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. సమస్యల్ని ఎదుర్కునే బలం చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను.

#HappyBirthDayPawanKalyan

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments